సారథి న్యూస్, గద్వాల: కరోనాను నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్ నేత షేక్ షావలీ ఆచారి విమర్శించారు. జోగుళాంబ గద్వాల జిల్లాలోని ప్రతి మండల కేంద్రంలో ప్రభుత్వం ఐసోలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కరోనా విస్తరిస్తున్న తరుణంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేతులెత్తేశాయని ఆరోపించారు. గద్వాల జిల్లాలో తక్కువ సంఖ్యలో టెస్టులు చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అనారోగ్యంతో ఉన్నవారందరికీ టెస్టులు చేయాలని కోరారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు కార్పొరేట్ దవాఖానల్లో వైద్యం చేయించుకుంటూ.. ప్రజలను మాత్రం గాంధీ ఆస్పత్రికి పంపుతున్నారని విమర్శించారు.
- July 30, 2020
- Archive
- మహబూబ్నగర్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- CARONA
- CONGRESS
- FAIL
- GOVERNMENT
- TRS
- కరోనా
- గద్వాల
- Comments Off on కరోనా కట్టడిలో ఫెయిల్