Breaking News

కరోనా కట్టడిలో ఫెయిల్​

సారథి న్యూస్​, వరంగల్​: కరోనాను అరికట్టడంలో రాష్ట్రప్రభుత్వం విఫలమైందని టీడీపీ వరంగల్​ పార్లమెంట్​ అధ్యక్షుడు చిటూరి అశోక్​ ఆరోపించారు. కరోనాను అరికట్డడంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ మంగళవారం హన్మకొండలో టీడీపీ నేతలు ఆందోళన చేపట్టారు. ట్రాఫిక్ అంతరాయం కలుగుతుందని పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ.. కరోనా టెస్టులు చేయకుండా రాష్ట్రప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తున్నదని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు మాడగాని మనోహర్, కుసుమ శ్యాంసుందర్, మార్గం సారంగం, బర్ల యాకూబ్, గొల్లపల్లి ఈశ్వరాచారి, చిలువేరు మహేశ్​, తోట రమేశ్​, అంబటి ప్రభాకర్, కొంగర ప్రభాకర్, కలమాల మహేందర్, అనిశెట్టి సతీశ్, కటకం కుమార్ స్వామి, బైరీ శేషాద్రి, కాగితాల జయశంకర్, ఎలగందుల రవీందర్ గుప్తా, హరిదాస్యం సురేశ్​ తదితరులు పాల్గొన్నారు.