సారథిన్యూస్, రామగుండం: తెలంగాణలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వసతులు కల్పించాలని వామపక్ష నాయకులు డిమాండ్ చేశారు. కరోనా పేషంట్లకు సరైన వైద్యం అందడం లేదని వారు విమర్శించారు. శుక్రవారం పెద్దపల్లిలోని ప్రభుత్వ ఆస్పత్రిని సీపీఐ, సీపీఎం, సీపీఐ ఎంల్ న్యూడెమోక్రసీ, తెలంగాణ ప్రజాఫ్రంట్ నేతలు సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పెద్దపల్లి జిల్లా ఆస్పత్రిలో కేవలం 88 మంది వైద్యసిబ్బంది మాత్రమే ఉన్నారని.. దీంతో రోగులకు సరైన వైద్యం అందించలేకపోతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం, సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యురాలు జ్యోతి, తెలంగాణ ప్రజా ఫ్రంట్ జిల్లా కన్వీనర్- గుమ్మడి కొమురయ్య, సీపీఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు కాదాశి లింగమూర్తి, పెరిక రాయమల్లు, సీపీఎం మండల కార్యదర్శి అశోక్, సీపీఐ టౌన్ అధ్యక్షుడు చంద్రగిరి ఉదయ్, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు విజయ్ అలాగే ప్రధాన కార్యదర్శి మానస్, సీపీఐ నాయకులు దిలీప్ కుమార్, ప్రశాంత్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
- August 21, 2020
- Archive
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- CARONA
- HOSPITELS
- KARIMNAGAR
- PEDDAPALLY
- కరోనా
- పెద్దపల్లి
- ప్రభుత్వ ఆసుపత్రులు
- రోగులు
- వామపక్షాలు
- సందర్శన
- Comments Off on ‘కరోనా’పై ఇంత నిర్లక్ష్యమా!