Breaking News

కరోనాపై అవగాహన

రామాయంపేట: మెదక్​ జిల్లా నిజాంపేట మండలం చల్మెడ గ్రామంలో బుధవారం ఏపీజీవీబీ (ఆంధ్రప్రదేశ్​ గ్రామీణ వికాస్​ బ్యాంక్​) ఆధ్వర్యంలో కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రజలంతా భౌతిక దూరం పాటించాలని, అత్యవసరమైతేనే ఇంట్లో నుంచి బయటకు రావాలని, విధిగా మాస్కులు ధరించాలని అధికారులు ప్రజలకు సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ నరసింహారెడ్డి, ఎంపీటీసీ నంద్యాల బాల్ రెడ్డి , ఉప సర్పంచ్ తుమ్మల రమేశ్​, వార్డు మెంబర్లు, రైతులు, ప్రజలు పాల్గొన్నారు.