సారథి న్యూస్, కర్నూలు: కనిపించని వైరస్‌తో ప్రపంచ దేశాలు పోరాటం చేస్తున్నాయని, నిర్లక్ష్యంతోనే వైరస్ వ్యాప్తి చెందుతుందని సోషల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ రమాదేవి అన్నారు. ఈ సమయంలో కొన్ని జాగ్రత్తలతో కరోనా మహమ్మారిని ఎదుర్కొందామని ఆమె పిలుపునిచ్చారు. గురువారం కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో సంస్కృతి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో వెయ్యి మాస్కులు, మూడొందల శానిటైజర్లు పంపిణీ చేశారు. అత్యవసరం అయితే తప్ప బయటికి రాకూడదని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించే ఉపాధి పనులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
నర్సుల అసోసియేషన్ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు శాంతిభవానీ మాట్లాడుతూ.. స్టాఫ్ నర్సులకు మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో బీజేపీ ఎస్సీ సెల్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి ప్రేమ్‌కుమార్, స్టాఫ్ నర్సు దేవమణి, సంజమ్మ, నిర్మల, మానిటరింగ్ కమిటీ సభ్యులు కిరణ్ కుమార్, యంగమరాజు, శ్రీను, నరసింహ వర్మ, వైఎస్సార్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కరుణానిధి పాల్గొన్నారు.