– విజయనగరం కలెక్టర్ హరిజవహర్ లాల్
సారథి న్యూస్, విజయనగరం: మహమ్మారిగా రూపొందిన కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు విజయనగరం జిల్లాలో ఆయుష్ మంత్రిత్వ శాఖ ద్వారా సరఫరా చేసిన ఆర్సినిక్ ఆల్బం–30 హోమియో మందును పంపిణీ చేయనున్నట్టు విజయనగరం జిల్లా కలెక్టర్ ఎం.హరిజవహర్ లాల్ తెలిపారు. హోమియో విభాగం ద్వారా జిల్లాకు లక్ష డోసులు సరఫరా చేశారని వెల్లడించారు. జిల్లాలో కరోనా నివారణ చర్యల్లో భాగంగా ఆయుష్ మంత్రిత్వ శాఖ నోడల్ ఆఫీసర్‌గా స్వామిని నియమించినట్లు తెలిపారు. ఆయనతో పాటు గుడివాడ, రాజమంత్రి హోమియో కాలేజీల్లో పీజీ స్కాలర్లుగా ఉన్న మరో ఐదుగురిని కరోనా ప్రత్యేక విధుల కోసం నియమించింది. కార్యక్రమంలో డీఆర్వో జె.వెంకటరావు, ఇన్చార్జ్ హోమియో వైద్యాధికారి సంబంగి శ్రీనివాస్‌రావు, ధనుంజయ్, సత్యేంద్రకుమార్, కృష్ణబాబు, సుశీల పాల్గొన్నారు.