సారథిన్యూస్, చొప్పదండి: కరోనా వ్యాధిని ఆరోగ్యశ్రీలో చేర్చాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం కరీంనగర్ జిల్లా చొప్పదండిలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట బీజేపీ నేతలు మౌనప్రదర్శన చేపట్టారు. అనంతరం తహసీల్దార్ అంబటి రజితకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు కరోనాతో ఇబ్బంది పడుతున్నారని .. వెంటనే కోవిడ్19ను ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్ చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ ను తెలంగాణలో అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీటీసీలు బత్తుల లక్ష్మీనారాయణ, తోట కొటేశ్, నాయకులు తిరుపతి, శ్రావణ్, రాజిరెడ్డి, గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
- August 14, 2020
- Archive
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- BJP
- CARONA
- CHOPPADANDI
- KARIMNAGAR
- MRO
- STRIKE
- Comments Off on కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చండి