![కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చండి](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/08/acpt-2f.jpg?fit=682%2C239&ssl=1)
సారథి న్యూస్, అచ్చంపేట: రోజురోజుకు విజృంభిస్తున్న కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఎస్.మల్లేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కోవిడ్ చికిత్సలను ఆరోగ్యశ్రీలో చేర్చాలని ఆదివారం నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలంలోని బ్రాహ్మణపల్లి, బుడ్డతండా, హాజీపూర్ గ్రామాల సర్పంచ్లకు వినతిపత్రాలు ఇచ్చారు. లాక్డౌన్ సందర్భంగా వ్యవసాయ కూలీలు, చేతివృత్తిదారులు, విద్యార్థులు, ప్రైవేట్ఉద్యోగులు, కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు. కరోనాకు ఉచితంగా వైద్యచికిత్సలు అందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు హరీశ్నాయక్, గణేష్, అజయ్, శ్రీనివాస్ నాయక్, లక్ష్మి, పరుశరాములు పాల్గొన్నారు.