సారథిన్యూస్, ఓయూ: కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని ఓయూ జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు మంగళవారం ఓయూ అరణ్యప్రాంతంలోని ఓ రహస్యప్రాంతంలో అమరణ దీక్ష చేపట్టారు. వీరి దీక్షను అడ్డుకొనేందుకు పోలీసులు తీవ్రంగా యత్నించారు. ఓయూ పరిసరప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రతావలయం ఏర్పాటుచేశారు. అయినప్పటికీ జేఏసీ నేతలు పోలీసుల కండ్లుగప్పి ఆందోళన నిర్వహించారు. ఓయూ జేఏసీ నేతల దీక్షకు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మానవతారాయ్ సంఘీభావం తెలిపారు. దీక్ష చేస్తున్న నేతలకు ప్రాణాలకు ఎమైనా హాని జరిగితే దానికి సీఎం కేసీఆరే బాధ్యత వహించాలని హెచ్చరించారు. దీక్షలో జేఏసీ నేతలు కొప్పుల ప్రతాప్‌రెడ్డి, ముఢావత్ భిక్షునాయక్, అనిల్ కుమార్ కామ్డె, నందుగౌడ్, కార్తీక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
- July 22, 2020
- Archive
- లోకల్ న్యూస్
- AROGYASRI
- CARONA
- JAC
- LEADERS
- OU
- ఓయూ
- కరోనా
- Comments Off on కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలి