సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ వైద్యారోగ్యశాఖ కరోనా హెల్త్ బులిటెన్‌ను గురువారం సాయంత్రం విడుదల చేసింది. ఇవాళ కొత్తగా 22 పాజిటివ్ కేసులు నమోదైనట్లు పేర్కొంది. కరోనాతో ఒకరోజే ముగ్గురు మృతిచెందగా, ఇప్పటి వరకు 28 చనిపోయినట్లు ప్రకటించింది.
తాజాగా 33 మంది కరోనా బాధితులు డిశ్చార్జ్ అయ్యారని, ఇప్పటి వరకు 442 మంది కోలుకున్నారని ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 1038 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వెల్లడించింది.