Breaking News

కరోనాతో ఎమ్మెల్యే మృతి

కోల్​కతా: కరోనా బారిన పడి మరో ఎమ్మెల్యే ప్రాణాలు కోల్పోయారు. పశ్చిమబెంగాల్​ రాష్ట్రంలోని ఈస్ట్ మిడ్నాపూర్ జిల్లా ఈగ్రా అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే సమరేష్ దాస్ కొంతకాంగా కరోనాతో బాధపడుతున్నారు. కరోనా విపత్తువేళ ఆయన నియోజకవర్గంలో పర్యటించి పేదప్రజలకు సేవచేశారు. కూరగాయలు, నిత్యావసరసరుకులు పంపిణీ చేసేవారు. ఈ క్రమంలో ఆయనకు కరోనా సోకింది.
దీంతో కోల్​కతాలోని ఒక ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న సమరేస్‌ సోమవారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. అంతకుముందు జూన్‌లో టీఎంసీ ఎమ్మెల్యే తమోనాష్ ఘోష్(60)కరోనాతో మృతి చెందిన విషయం తెలిసిందే. సమరేష్ దాస్ మృతి పార్టీకి తీరని లోటని, ఆయనకు సీఎం మమతాబెనర్జీ సంతాపం తెలిపారు.