Breaking News

కరోనాకు వ్యాక్సిన్​ రెడీ

అమెరికాకు చెందిన ఓ పరిశోధనసంస్థ కరోనాకు వ్యాక్సిన్​ను సిద్ధం చేస్తున్నది. రెమ్​డెసివీర్​ అనే వ్యాక్సిన్​ కోవిడ్​ కు కొంతవరకు అశాజనకంగా పనిచేస్తున్నదని వైద్యులు చెప్తున్నారు. దీంతో దీన్ని ఉత్పత్తి చేసేందుకు అమెరికాకు చెందిన ప్రముఖ పరిశోధన సంస్థ గిలీడ్ ఆసక్తి చూపుతున్నది. ఈ సంస్థ ఇండియాలోని సిప్లా, జుబిలెంట్ లైఫ్ సైన్స్, హెటిరో ఫార్మా, డాక్టర్ రెడ్డీస్, జైడస్, క్యాడిలా ఫార్మా కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ కంపెనీలు వ్యాక్సిన్ ను తయారు చేసి 127 దేశాలకు ఎగుమతి చేయాల్సి ఉంటుంది.
గిలీడ్ ఫార్మా.. ఔషధానికి సంబంధించిన ఫార్ములాను ఆయా కంపెనీలకు బదిలీ చేస్తుంది. కరోనా పాజిటివ్ వచ్చిన రోగులకు మాత్రమే వీటిని అందిస్తారు. కరోనా తీవ్రతను బట్టి మొదటిరోజు రెండు డోసులు, తరువాత రోజులు ఒక్కో డోసు చొప్పున ఇవ్వాల్సి ఉంటుంది. ఐదు డోసులకు గాను రూ.40వేల రూపాయల వరకు ఖర్చు అవుతుందని నిపుణులు చెప్తున్నారు.