సారథి న్యూస్, మెదక్: ప్రమావశాత్తు కరెంట్ షాక్ తో ఓ మహిళ మృతిచెందింది. ఈ సంఘటన శనివారం మెదక్ పట్టణంలో చోటుచేసుకుంది. స్థానిక గోల్కొండ వీధికి చెందిన బిస్మిల్లా బీ (55) తన ఇంటి ఆవరణలో చెట్టు వద్ద పేరుకున్న చెత్తాచెదారం తొలగిస్తుంగా పైన ఉన్న విద్యుత్ వైర్లకు చేతి తగిలింది. దీంతో కరెంట్ షాక్ తో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.
విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్షం వల్లే ప్రమాదం జరిగిందని ఆరోపిస్తూ బిస్మిల్లా బీ డెడ్ బాడీతో బాధిత కుటుంబసభ్యులు, బంధువులు పట్టణంలోని ఫ్యూజ్ ఆఫ్ కాల్ ఆఫీస్ వద్ద ఆందోళనకు దిగారు. మెదక్ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ బాధిత కుటుంబాన్ని ప్రభుత్వపరంగా ఆదుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ ఘటనపై మెదక్ టౌన్ పోలీసులు కేసుదర్యాప్తు చేస్తున్నారు.