Breaking News

కమీషన్ల కోసమే ప్రాజెక్టులు

జలదీక్షలో పాల్గొన్న కాంగ్రెస్​ నేతలను అరెస్ట్​ చేస్తున్న పోలీసులు

సారథి న్యూస్​, హుస్నాబాద్ : టీఆర్​ఎస్​ ప్రభుత్వం కమీషన్ల కోసమే సాగునీటి ప్రాజెక్టులు నిర్మిస్తున్నదని ఏఐసీసీ కార్యదర్శి సంపత్​కుమార్​ పేర్కొన్నారు. శనివారం కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన జలదీక్షలో భాగంగా సిద్దిపేట్ జిల్లా అక్కన్నపేట మండలం గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టుల వద్ద కాంగ్రెస్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సంపత్​కుమార్​ మాట్లాడుతూ.. మెట్ట ప్రాంతమైన హుస్నాబాద్ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసేందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లో దివంగత సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టుల భూమిపూజ చేసి ఏళ్లు గడుస్తున్నా నేటికి పనులు తూతూ మంత్రంగానే కొనసాగుతున్నాయన్నారు విరుచుకుపడ్డారు. కాగా నిరసన తెలిపిన కాంగ్రెస్​ నాయకులను పోలీసులు అరెస్ట్​ చేశారు. కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి బొమ్మ శ్రీరాం చక్రవర్తి, డీసీసీ అధికార ప్రతినిధి లింగమూర్తి, సింగిల్ విండో చైర్మన్ శివయ్య హుస్నాబాద్, అక్కన్నపేట మండల్ ప్రెసిడెంట్స్ ఐలయ్య, శ్రీనివాస్ జిల్లా కార్యదర్శులు సత్యనారాయణ, యాదవరెడ్డి, రవీందర్, కౌన్సిలర్లు పద్మ, స్వర్ణ లత, రాజు, కృష్ణస్వామి, సది, సురేశ్ తదితరులు పాల్గొన్నారు.