కోలీవుడ్‌లో కళామతల్లి ముద్దు బిడ్డ కమల్‌హాసన్ సొంత బ్యానర్ రాజ్ కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్ లో సూపర్ స్టార్ రజినీకాంత్‌తో సినిమా తీయనున్నారని.. ‘ఖైదీ’ ఫేమ్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించనున్నారన్న వార్త చాలా రోజుల క్రితం హల్ చల్ చేసింది. అయితే రజినీ ‘దర్బార్’ చిత్రం తర్వాత ‘వీరం, వేదాళం, వివేకం, విశ్వాసం’ లాంటి సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించిన శివ దర్శకత్వంలో ‘అన్నాత్తా’ మూవీ చేస్తున్నారు. ఈ చిత్రంలో రజినీ కాంత్ సరసన హీరోయన్స్ గా ఖుష్బూ, మీనాలు చేస్తుండగా ఓ కీలక పాత్రలో కీర్తి సురేష్ నటిస్తోంది. అయితే కమల్ హాసన్ తీయబోయే సినిమా ఆగిపోయిందని.. రజినీ ఆ సినిమా లో నటించడం లేదన్న వార్తొకటి రీసెంట్ గా చక్కర్లు కొట్టడం మొదలెట్టింది. దాంతో కమల్ అవి కేవలం రూమర్స్ మాత్రమేనని.. సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని.. పరిస్థితులు చక్కబడ్డాక నవంబర్‌లో చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారని క్లారిటీ ఇచ్చారు. అన్నీ కుదిరితే వచ్చే ఏడాదే ఈ చిత్ర రిలీజ్ కూడా ఉంటుందని అంటున్నారు.
- July 8, 2020
- Archive
- Top News
- సినిమా
- KAMALHASAN
- KOLLYWOOD
- RAJINIKANTH
- కమల్‌హాసన్
- కోలీవుడ్
- ఖైదీ
- రజనీకాంత్
- Comments Off on కమల్, రజిని కాంబినేషన్