సారథి న్యూస్, హైదరాబాద్: ఇటీవల చైనా సైనికుల దాడిలో అసువులు బాసిన కల్నల్ సంతోష్‌బాబు సతీమణి సంతోషిని కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ (గ్రూప్–1 కేడర్)గా నియమిస్తూ తెలంగాణ ప్రభు త్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సోమవారం రాత్రి జీవో నం.80 జారీ చేశారు. ఆమె నియామకాన్ని ప్రత్యేక కేసుగా పరిగణించినట్లు పేర్కొన్నారు. ఆమె నెలరోజుల్లో సం బంధిత శాఖ కమిషనర్‌కు రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. ఈ జీఓ ప్రకారం సంతోషి వేత నం రూ. 40,270 నుంచి రూ.93,780 వరకు ఉంటుంది. వీటికి అలవెన్స్‌లు అదనం. అయితే సంతోషి ఒకవేళ వేరే పోస్టును కోరుకుంటే ఆ విషయాన్ని రెండు రోజుల్లోగా తెలియజేయాలని సీఎం కేసీఆర్ సూచించినట్లు తెలిసింది.
స్థలం కేటాయింపు
సంతోషికి 711 గజాల ఇంటి స్థలం కేటాయిస్తూ జీఓ నం.59ను సీఎస్ విడుదల చేశారు. హైదరాబాద్ జిల్లాలోని షేక్‌పేట రెవెన్యూ గ్రామ పరిధిలోని సర్వేనం.6/1, వార్డు నం.10, రోడ్డు నం.14 బంజారాహిల్స్‌లో కల్నల్ సంతోష్‌బాబు సతీమణి సంతోషి పేరు మీద 711 గజాల స్థలం ఇస్తున్నట్లు అందులో పేర్కొన్నారు.
- June 23, 2020
- Archive
- Top News
- తెలంగాణ
- COLNOL SANTHOSH BABU
- SANTHOSHI
- తెలంగాణ
- సీఎస్ సోమేశ్‌కుమార్
- హైదరాబాద్
- Comments Off on కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్‌గా సంతోషి