సారథిన్యూస్, సిరిసిల్ల: ఇటీవల మరణించిన ఓ మహిళకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం కాస్బె కట్కూర్ ప్రజలు భయాందోళన చెందుతున్నారు. కట్కూర్‌కు చెందిన లక్ష్మమ్మ అనే మహిళ దగ్గు, తుమ్ములతో సోమవారం మృతిచెందింది. అదేరోజు ఆమెకు సిరిసిల్లలోని ప్రభుత్వ దవాఖానలో కరోనా పరీక్షలు చేశారు. ఫలితాలు రాకముందే మహిళకు గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. తాజాగా లక్ష్మమ్మకు కరోనా పాజిటివ్ వచ్చినట్టు సమాచారం. దీంతో అంత్యక్రియల్లో పాల్గన్నవారందరినీ అధికారులు గుర్తించి హోం క్వారంటైన్‌కు పంపుతున్నారు. గ్రామంలో హైడ్రోక్లోరిక్ ద్రావణం చల్లుతూ వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకుంటున్నారు. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉన్నది.
- June 24, 2020
- Archive
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- CARONA
- SIRICILLA
- WOMEN
- అంత్యక్రియలు
- హోం క్వారంటైన్
- Comments Off on కట్కూర్లో భయం, భయం