సారథి న్యూస్, రామడుగు: ఇటీవల కరోనాతో మృతిచెందిన కరీంనగర్ జిల్లా రామడుగు మండలం పందికుంటపల్లి సర్పంచ్ కటుకం రవీందర్‌కు ఎంపీటీసీల ఫోరం ఆధ్వర్యంలో నివాళి అర్పించారు. ఆయన చిత్రపటం వద్ద పూలమాలలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. ఆయన మృతి టీఆర్ఎస్ పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ ఫోరం అధ్యక్షుడు నరేందర్‌రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు పూడూరి మల్లేశం, నేరెల్ల అంజయ్య, ఎడవెల్లి పాపిరెడ్డి, పైండ్ల శ్రీనివాస్, రజబ్ అలీ, దాసరి బాబు, రేణికుంట బసంతం, పైండ్ల మదు, కొలిపాక కమలాకర్, దాసరి బాబు తదితరులు పాల్గొన్నారు.
- August 31, 2020
- Archive
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- CARONA
- DEATH
- KARIMNAGAR
- MPTC
- PASSAWAY
- SARPANCH
- కరోనా
- మృతి
- Comments Off on కటుకం రవీందర్‌కు నివాళి