Breaking News

కండలవీరుడిగా నాగశౌర్య

కండల వీరుడిగా నాగశౌర్య

‘అశ్వత్థామ’ సినిమాతో రఫ్ హీరోగా దర్శనమిచ్చిన యంగ్ హీరో నాగశౌర్య ఇప్పుడు లుక్ ను మరింత రఫ్ చేశాడు. తన కెరీర్​లో 20వ చిత్రంగా రాబోతున్న సినిమా కోసం శౌర్య చేసిన వర్క్​అవుట్స్ తన లుక్​, కటౌట్​ను మార్చేశాయి. ఇంట్లోనే జిమ్ ను ఏర్పాటుచేసుకుని కఠోర వ్యాయామాలు చేశాడు. వావ్ అనిపించుకునే కండలు తిరిగిన దేహంతో అభిమానులను అబ్బురపరిచాడు. ‘ఆట ఎప్పుడూ ఒకేలా ఉండదు’ అంటూ ఈ చిత్రంలో నాగశౌర్యకు సంబంధించిన ప్రీ లుక్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్, నార్త్ స్టార్ ఎంటర్​టైన్​మెంట్స్​బ్యానర్స్ పై నారాయణ్ దాస్ కె నారంగ్, పుష్కర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ కలిసి నిర్మిస్తున్నారు.

ఈ చిత్రానికి ‘సుబ్రహ్మణ్యపురం’ డైరెక్టర్ ధీరేంద్ర సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తున్నారు. కాలభైరవ సంగీతం సమకూరుస్తుండగా రామ్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి సంబందించిన ఫస్ట్ లుక్ జూలై 27న రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కాగా, లేడీ డైరెక్టర్ లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో ఓ సినిమాకు కమిట్ మెంట్ ఇచ్చాడు శౌర్య. ఈ సినిమాను సితార ఎంటర్​టైన్​మెంట్స్బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మించనున్నారు. అలానే ‘ఊహలు గుసగుసలాడే’ ఫేమ్ అవసరాల శ్రీనివాస్ డైరెక్షన్ లో పీపుల్స్ మీడియా వారితో ఓ సినిమా చేయనున్నాడని కూడా సమాచారం.