రాజ్ తరుణ్ నటించిన ‘ఒరేయ్ బుజ్జిగా’ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. మాళవిక అయ్యర్, హెబ్బా పటేల్ హీరోయిన్స్ గా నటించారు. తెలుగు డిజిటల్ ప్లాట్ ఫామ్ ‘ఆహా’లో అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా విడుదల కానున్న ఈ చిత్ర ట్రైలర్ను నాగచైతన్య విడుదల చేశాడు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా రూపొందించిన ఈ చిత్ర ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది. ‘నాదొక బ్యూటిఫుల్ ఫెంటాస్టిక్ మార్వలెస్ లవ్ స్టోరీ’ అని హీరో చెప్పే డైలాగ్ తో సినిమాపై ఆసక్తి కలుగుతోంది.
‘ప్రపంచంలో ప్రతి మగ వెధవా నా ప్రైవసీని డిస్టర్బ్ చేసేవాడే..’ ‘మీకు రిలేషన్ షిప్ లో ఉన్నన్ని రోజులు బాయ్ ఫ్రెండ్ లక్స్ సోప్ లాంటోడే.. ఒళ్లంతా రాసేసుకుంటారు.. బ్రేకప్ అయిన తర్వాత డెటాల్ సోప్ లాంటోడని చేతులు కడుక్కోడానికి మాత్రమే వాడతారు’ ‘ఇదేంటి వీడు టీడీపీని ఆర్జీవీ తగులుకున్నట్లు తగులుకున్నాడు’ వంటి డైలాగ్స్ సినిమాలో కావాల్సినంత కామెడీ ఉందని తెలియజేస్తున్నాయి. మొత్తం మీద ట్రైలర్ ఆద్యంతం కామిడీ సన్నివేశాలతో ఆకట్టుకుంది. కాగా ‘ఒరేయ్ బుజ్జిగా’ చిత్రానికి ‘గుండె జారి గల్లంతయ్యిందే’, ‘ఒక లైలా కోసం’ వంటి సక్సెస్ ఫుల్ చిత్రాలను అందించిన విజయ్ కుమార్ కొండా దర్శకత్వం వహించారు. సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పై కేకే రాధామోహన్ నిర్మించారు. వాణీవిశ్వనాథ్, సీనియర్ నరేష్, పోసాని కృష్ణమురళి, అనీష్ కురువిళ్ల, సప్తగిరి, రాజారవీంద్ర, అజయ్ ఘోష్, సత్యం, రాజేష్, సత్య ఇతర ప్రధాన పాత్రల్లో కనిపిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి ఐ. ఆండ్రూ సినిమాటోగ్రఫీ అందించగా.. అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చాడు.
- September 28, 2020
- Archive
- Top News
- సినిమా
- AHA
- OREY BUJJIGA
- OTT
- RGV
- ఆర్జీవీ
- ఆహా
- ఒరేయ్ బుజ్జిగా
- ఓటీటీ
- Comments Off on ‘ఒరేయ్ బుజ్జిగా’.. నవ్వించేలా