న్యూఢిల్లీ: మన దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో 22,752 కేసులు నమోదయ్యాయి. దీంతో బుధవారం ఉదయానికి కేసుల సంఖ్య 7,2,417కి చేరింది. 482 మంది చనిపోవడంతో వ్యాధి బారినపడి మరణించిన వారి సంఖ్య 20,642కు చేరింది. ఇప్పటివరకు 4,56,831 మంది వ్యాధి నుంచి రికవరీ అయ్యారని, రికవరీ రేటు 61.53శాతం ఉందని హెల్త్ మినిస్ట్రీ ప్రకటించింది. పాజిటివ్ టెస్టింగ్ రేట్ 8.66 శాతం ఉందని అన్నారు. కేసుల సంఖ్యలో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉండగా, తమిళనాడు, ఢిల్లీ వాటి తర్వాత స్థానాల్లో నిలిచాయి. కాగా.. ప్రస్తుతం తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా పరిస్థితి దారుణంగా తయారయ్యే అవకాశాలు ఉన్నట్లు హెల్త్ ఎక్స్‌పర్ట్స్ అంచనా వేస్తున్నారు.
- July 8, 2020
- Archive
- జాతీయం
- CARONA
- POSITIVE
- TELANGANA
- ఇండియా
- కరోనా
- తెలంగాణ
- న్యూఢిల్లీ
- Comments Off on ఒకేరోజు 22,752 కేసులు