న్యూఢిల్లీ: దేశంలో వరుసగా ఐదో రోజు పెట్రోల్, డీజీల్ ధరలు పెరిగాయి. ఐదు రోజుల్లో పెట్రోల్ ధర రూ.2.74, డీజిల్ ధర రూ.2.83 మేర పెరిగింది. ఈనెల 7 నుంచి మొదలుపెట్టి ప్రతి రోజు ప్రభుత్వ చమురు కంపెనీలు ధరలు రివైజ్ చేస్తూనే ఉన్నాయి. దీంతో గురువారం పెట్రోల్ ధర లీటర్‌కు రూ.74 కాగా.. డీజిల్ ధర రూ.73.40కి చేరుకుంది.
ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు
నగరం | పెట్రోల్(రూ.) | డీజిల్ (రూ.) |
ఢిల్లీ | 74 | 72.22 |
ముంబై | 80.98 | 70.92 |
చెన్నై | 77.96 | 70.64 |
బెంగళూరు | 76.39 | 68.66 |
హైదరాబాద్ | 76.82 | 70.59 |