అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గురువారం కొత్తగా 9,996 కరోనా కేసులు నమోదయ్యాయి. వ్యాధిబారిన పడి తాజాగా 82 మంది మృతిచెందారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 2,378కు చేరింది. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు 2,64,142కు చేరాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 90,840కు చేరింది. వ్యాధిబారిన పడి 24 గంటల్లో 9,499 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 1,70,924 మంది కోలుకున్నారు.
ఇక వ్యాధి తీవ్రతను జిల్లాల వారీగా పరిశీలిస్తే.. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 1,504 కేసులు నమోదయ్యాయి. చిత్తూరు 963, విశాఖపట్నం 931, అనంతపురం 856, పశ్చిమగోదావరి 853, కర్నూలు 823, కడప 784, నెల్లూరు 682, ప్రకాశం 681, గుంటూరు 595, విజయనగరం 569, శ్రీకాకుళం 425, కృష్ణా జిల్లాలో 330 చొప్పున కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.