అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే విద్యాసంవత్సరానికి ప్రణాళికను ప్రభుత్వం ఖరారుచేసింది. సెప్టెంబర్ 5న స్కూళ్లను పున:ప్రారంభిస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ప్రకటించారు. అలాగే అక్టోబర్ 15న కాలేజీలను పున:ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. స్కూళ్లు ప్రారంభమైన రోజే 43లక్షల మంది విద్యార్థులకు ‘జగనన్న విద్యాకానుక’ అందిస్తామని పేర్కొన్నారు. గురువారం ఆయన అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. స్కూళ్ల రీ ఓపెనింగ్‌కు ముందే వెబ్ కౌన్సెలింగ్ ద్వారా టీచర్ల బదిలీలు నిర్వహిస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో సెప్టెంబర్ 15 నుంచి 21వ తేదీలోపు అన్ని సెట్లు నిర్వహిస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఎంసెట్, ఈసెట్, ఐసెట్, పీజీసెట్, లా సెట్, ఎడ్ సెట్‌లను ఒకే వారంలో నిర్వహిస్తామని మంత్రి ఆదిమూలపు సురేశ్ స్పష్టం చేశారు.
- August 13, 2020
- Archive
- Top News
- ఆంధ్రప్రదేశ్
- స్టడీ
- ADIMULAPU
- CM JAGAN
- EDUCATION MINISTER
- SCHOOLS REOPEN
- ఆంధ్రప్రదేశ్
- సీఎం జగన్
- స్కూల్స్రీఓపెన్
- Comments Off on ఏపీలో సెప్టెంబర్ 5న స్కూళ్ల పున:ప్రారంభం