అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంసెట్ సహా అన్ని రకాల ఎంట్రెన్స్‌లను వాయిదా వేసింది. కరోనా సమయంలో సీఎం వైఎస్జగన్మోహన్రెడ్డి సూచనలతో ఎంసెట్, ఐసెట్, ఈసెట్, లాసెట్, ఎడ్‌సెట్, పీజీ సెట్‌లతో కలిపి మొత్తం 8 సెట్ల ఎగ్జామ్స్‌ను వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ సోమవారం ప్రకటించారు. దీనికి సంబంధించి త్వరలోనే పరీక్షల తేదీలను వెల్లడిస్తామని తెలిపారు. సెప్టెంబర్ మూడవ వారంలో ఎంసెట్ నిర్వహిస్తామని, దీనికి సంబంధించిన పరీక్ష తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొన్నారు. డిగ్రీ, పీజీలో మొదటి, రెండో సంవత్సరం సంబంధించి సెమిస్టర్ పరీక్షలు వాయుదా వేస్తున్నామన్నారు. సెప్టెంబర్‌లో డిగ్రీ ఫైనల్ ఇయర్ పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి పేర్కొన్నారు.
- July 13, 2020
- Archive
- షార్ట్ న్యూస్
- CARONA
- Jagan
- ఆంధ్రప్రదేశ్
- కరోనా
- జగన్
- Comments Off on ఏపీలో అన్ని ఎంట్రెన్స్‌లు వాయిదా