సారథి న్యూస్, వాజేడు: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీ చట్టాలను నిర్వీర్యం చేస్తూ ఆదివాసీల మీద అత్యంత పాశవికంగా దమనకాండ కొనసాగిస్తోందని ఆదివాసీ నవ నిర్మాణసేన రాష్ట్ర అధ్యక్షుడు పూనేం సాయి విమర్శించారు.ఏజెన్సీ నూతన రెవెన్యూ చట్టాన్ని, ఎల్ఆర్ఎస్ను నిలిపివేయకపోతే ఆదివాసీ ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, తమ పదవులకు రాజీనామా చేయాలని సాయి డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. 1970కు ముందు ఉన్న గిరిజనేతరులందరికీ భూములపై హక్కు కల్పించారని తెలిపారు. 1/70చట్టం వచ్చిన తర్వాత గిరిజనేతురులకు ఎలాంటి భూమి హక్కు, భూబదలాయింపులు చేయకూడదని చట్టం చెబుతున్నా రాష్ట్ర ప్రభుత్వం గిరిజన చట్టాలను నిర్వీర్యం చేస్తుందన్నారు. షెడ్యూల్ ప్రాంతం విచ్ఛిన్నమవుతుంటే ఆదివాసీ ఎమ్మెల్యేలు మొద్దునిద్రలో ఉన్నారని విమర్శించారు. త్వరలోనే ఆదివాసీ ఎమ్మెల్యేల ఇళ్లకు ప్రజలతో ముట్టడిస్తామని హెచ్చరించారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు ఎట్టి విద్యాసాగర్, మడకం రవి, భార్గవ్, రాంప్రసాద్, అశోక్ పాల్గొన్నారు.
- October 13, 2020
- Archive
- లోకల్ న్యూస్
- వరంగల్
- ADIVASI
- CM KCR
- LRS
- MULUGU
- VAJEDU
- ఆదివాసీలు
- ఎల్ఆర్ఎస్
- గిరిజనులు
- ములుగు
- వాజేడు
- సీఎం కేసీఆర్
- Comments Off on ఏజెన్సీలో నూతన రెవెన్యూ చట్టాన్ని నిలిపేయాలి