‘రాజావారు రాణిగారు’ సినిమాతో హీరోగా పరిచయమైన కిరణ్ అబ్బవరం నటిస్తున్న మరో సినిమా ‘ఎస్ ఆర్ కల్యాణమండపం’. శ్రీధర్ గాదే దర్శకత్వంలో తెరకెక్కుతోంది ఈ సినిమా. ‘టాక్సీవాలా’ చిత్రంతో క్రేజ్ తెచ్చుకున్న ప్రియాంక జవాల్కర్ హీరోయిన్ గా నటిస్తోంది. సాయికుమార్ కీలకపాత్రలో నటిస్తున్నాడు. ఎలైట్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రమోద్, రాజు నిర్మిస్తున్నారు. ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ చైతన్ భరద్వాజ్ ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్. ఇప్పటికే విడుదలైన టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ మంచి రెస్పాన్స్ వచ్చింది. రీసెంట్ గా ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేశాడు హీరో నిఖిల్. ‘చూసాలే కళ్లారా..’ అంటూ సాగే ఈ పాటకు క్రిష్ణకాంత్ సాహిత్యాన్ని అందించాడు. సిద్ శ్రీ రామ్ పాడిన ఈ మెలోడీ మ్యూజిక్ లవర్స్ ను బాగానే ఆకట్టుకుంటోంది.
- September 8, 2020
- Archive
- Top News
- సినిమా
- CHAITANBARADWAJ
- KIRAN ABBAVARAM
- SR KALYANAMANDAPAM
- TAXIWALA
- ఎస్ ఆర్ కల్యాణమండపం
- కిరణ్ అబ్బవరం
- చైతన్భరద్వాజ్
- టాక్సీవాలా
- Comments Off on ‘ఎస్ ఆర్ కల్యాణమండపం’ ఫస్ట్ సాంగ్ హిట్టు