ప్రముఖ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ సునీత సోషల్ మీడియా ద్వారా ఒక హెచ్చరిక చేశారు. సునీత మేనల్లుడిని.. అంటూ పరిచయం చేసుకుంటూ ఓ వ్యక్తి మోసాలకు పాల్పడుతున్నాడట. కొందరి వద్ద డబ్బులు కూడా తీసుకున్నాడట. ఈ విషయం సునీత దృష్టికి వచ్చి ఆమెకు ఆగ్రహాన్ని తెప్పించింది. దాంతో ఆమె ఫేస్ బుక్ లో ఒక వీడియోను షేర్ చేస్తూ.. ‘చైతన్య పేరుతో ఉన్న వ్యక్తి ఎవరో నాకు తెలీదు.. అయినా అలా చెప్పేయగానే క్లారిటీ తీసుకోకుండా అలా ఎలా నమ్మేస్తారు? డబ్బులు ఎలా ఇచ్చేస్తారు? ఇకమీదట అలా ఎవరైనా మీవద్దకు వచ్చి, నా పేరు చెప్పి అవకాశాలు ఇప్పిస్తా అంటే నమ్మొదు..’ అంటూ మోసపోయిన వాళ్లపై కూడా అసహనం వ్యక్తం చేసింది సునీత. దీంతో మోసపోయిన వాళ్లు ఏమీ చేయలేకపోయినా మిగతావాళ్లు జాగ్రత్తపడే అవకాశం ఉంటుంది కదా!
- July 29, 2020
- Archive
- Top News
- సినిమా
- MONEY FRAUD
- SINGER
- SUNITHA
- చైతన్య
- డబ్బులు ప్రాడ్
- సింగర్
- సునిత
- Comments Off on ఎవరూ మోసపోవద్దు