స్టార్డమ్ పెరిగాక ఆచి తూచి సినిమాలు చేస్తోంది సమంత. ప్రస్తుతం ‘ఫ్యామిలీ మ్యాన్2’ వెబ్ సిరీస్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే నయనతార, విజయ్ సేతుపతితో కలిసి తమిళంలో ‘కాత్తు వాక్కుల్ రెండు కాదల్’ మూవీ చేస్తోంది. అయితే తాజాగా మరో టాలీవుడ్ లో మరో సినిమాలో నటిస్తున్నట్లు వినిపిస్తోంది. సంగీత సామ్రాజ్యానికి చక్రవర్తి వంటి వారైన లెజండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు ఎన్నో ఏళ్లుగా ‘బెంగళూరు నాగరత్తమ్మ’ జీవితకథను తెరకెక్కించాలని అనుకుంటున్నారట. ప్రధాన పాత్రలో సమంత అయితే బాగుంటుందని అనుకుంటున్నారట.
బెంగళూరు నాగరత్తమ్మ 1878 లో పుట్టి 1954 వరకూ సంగీత సామ్రాజ్యాన్ని ఏలింది. చిన్నతనం నుంచే కర్నాటక సంగీతాన్ని అభ్యసించి సంస్కృత, కన్నడ, తెలుగు భాషల్లో మంచి పట్టు సాధించింది. నాగరత్తమ్మకు ఒక్క సంగీతమే కాదు, క్లాసికల్ డ్యాన్స్ కూడా అబ్బింది. దానికి తోడు వారసత్వంగా హరికథలు చెప్పడంలో కూడా నేర్పరి. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం నాగరత్తమ్మ ఫెమినిస్ట్. అప్పట్లోనే మహిళల ఉన్నతి కోసం పోరాడిన ఘనత కూడా ఆమె సొంతం. అంటే డేరింగ్ అండ్ డాషింగ్ లేడీ. ఇలాంటి పాత్రలో సమంత అయితే కరెక్ట్‌గా సూటవుతుందన్న ఆయన అభిప్రాయంలో ఎలాంటి సందేహం లేదనే చెప్పొచ్చు ఎందుకంటే ఆమె నటనా సామర్థ్యం అలాంటిది కాబట్టి. అయితే ఈ చిత్రానికి సింగీతం శ్రీనివాసురావు దర్శకత్వం వహిస్తారా? లేదా? అన్నది మాత్రం సస్పెన్స్‌గానే ఉంది. ఆయన శిష్యుల్లో ఎవరికైనా ఈ పని అప్పగిస్తారో కూడా తెలీదు. కానీ నేటి జనరేషన్ కు తగ్గట్టు ఈ బయోపిక్ మేకింగ్ కోసం సింగీతం చాలానే హార్డ్ వర్క్ చేస్తున్నారట.
- September 30, 2020
- Archive
- Top News
- సినిమా
- NAGARATHAMMA
- NAYAN
- SAMANTHA
- SINGITHAM
- కాత్తు వాక్కుల్ రెండు కాదల్
- నయనతార
- నాగరత్తమ్మ
- విజయ్
- సమంత
- Comments Off on ఎవరీ నాగరత్తమ్మ?