Breaking News

ఎరువుల ఉత్పత్తి వేగవంతం

నిరంజన్​రెడ్డి

సారథిన్యూస్​, పెద్దపల్లి: ఎరువుల కర్మాగారం నిర్మాణపనులు త్వరితగతిన పూర్తిచేసి సెప్టెంబర్ నాటికి ఉత్పత్తి ప్రారంభించాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సంబంధిత అధికారులకు సూచించారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో నిర్మిస్తున్న ఎరువుల కర్మాగారాన్ని ఆయన సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, జెడ్పీ చైర్మన్ పుట్ట మధు, కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్, దాసరి మనోహర్​రెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రూ.6120.5 కోట్ల నిర్మాణంతో చేపట్టిన ఎరువుల కర్మాగార పునరుద్ధరణ పనులు 99% పూర్తి అయ్యాయని మంత్రి అన్నారు. కార్యక్రమంలో రామగుండం మేయర్ అనిల్ కుమార్, డిప్యూటీ మేయర్, జిల్లా ఇంచార్జి రెవెన్యూ అధికారి నరసింహమూర్తి, జిల్లా వ్యవసాయ అధికారి తిరుమల ప్రసాద్, సహకార అధికారి చంద్రప్రకాశ్​రెడ్డి, అధికారులు రాజన్ వికే బంగార్, ప్రొడక్షన్​ మేనేజర్ ఎస్కే జా, చీఫ్ మేనేజర్ హెచ్ ఆర్ సోమనాథ్ సంకా, రామగుండం తహసీల్దార్​ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.