చాలామంది కొత్త నటీనటులకు అవకాశం ఇస్తూ.. పెద్దపెద్ద చిత్రాలను నిర్మిస్తూ.. టాలీవుడ్ తిరుగులేని ప్రొడ్యూసర్ గా కొనసాగుతున్న దిల్ రాజు ఆదివారం రెండవ వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం అమలులో ఉన్న లాక్ డౌన్ నిబంధనలను అనుసరిస్తూ అతి తక్కువమంది సమక్షంలోనే ఆయన తేజశ్విని అనే ఆమెను వివాహం చేసుకున్నారు. తేజశ్విని ఎయిర్ హోస్టెస్‌గా పనిచేస్తున్నారు. మూడేళ్ల క్రితం దిల్ రాజు భార్య అనిత గుండెపోటుతో చనిపోయారు. 2017 నుంచి దిల్ రాజు ఒంటరిగా ఉంటున్నందున తండ్రికి మళ్లీ పెళ్లిచేయాలని ఆయన కూతురు అనిషితరెడ్డి భావించారు. నిజామాబాద్ జిల్లాలోని తన సొంతూరు నర్సింగ్ పల్లిలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో అతినిరాడంబరంగా వారి వివాహ వేడుకను జరిపించారు. ఈ సందర్భంగా దిల్ రాజుకు చిత్రపరిశ్రమ నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
- May 23, 2020
- Archive
- DILRAJU
- TOLLYWOOD
- ఎయిర్ హోస్టెస్
- నిజామాబాద్
- Comments Off on ఎయిర్ హోస్టెస్ తో దిల్ రాజు పెళ్లి