- ‘జనతా గ్యారేజ్’ పాటకు స్టెప్పులు
న్యూఢిల్లీ: ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ మరోసారి తెలుగు పాటతో హల్చల్ చేశాడు. అయితే ఈసారి టాలీవుడ్ హీరో ఎన్టీఆర్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ టిక్ టాక్ వీడియోచేశాడు. జనతా గ్యారేజ్ సినిమాలోని ‘పక్కా లోకల్’ పాటకు.. భార్య క్యాండీస్ తో కలిసి స్టెప్పులతో అదరగొట్టాడు. ‘మేం ప్రయత్నించాం. కానీ మీ డాన్స్ చాలా స్పీడ్ గా ఉంది’ అని వార్నర్ మెసేజ్ రాశాడు. ఈ వీడియోను సన్ రైజర్స్ హైదరాబాద్ తన ట్విట్టర్లో పోస్ట్ చేసింది.