Breaking News

ఎనీటైం అలర్ట్​గా ఉండాలి

అనుక్షణం అలర్ట్​గా ఉండాలి

సారథి న్యూస్​, కర్నూలు: కర్నూలు జిల్లాతో పాటు ఎగువన కర్ణాటక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలు, వరదలపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని, గతేడాది ఫ్లాష్ ఫ్లడ్స్ అనుభవాలను దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్​ ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అధికారులకు సూచించారు. సోమవారం ఆయన కర్నూలు ఏపీఎస్పీ బెటాలియన్ గెస్ట్ హౌస్ లో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. శ్రీశైలం, సుంకేసుల, గాజులదిన్నె డ్యాములు, వెలుగోడు, గోరకల్లు, పోతిరెడ్డిపాడు, అవుకు, కృష్ణగిరి, పందికోన హంద్రీ రిజర్వాయర్లు, తుంగభద్ర, వేదవతి, హగరి, హంద్రీ, కుందూ తదితర నదులు, చెరువులు, వాగులు, వంకల వరద ప్రవాహాన్ని ప్రతిక్షణం గమనిస్తూ, ప్రాణనష్టం, పంట నష్టం రాకుండా చూడాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తూ ఇళ్లు, కాలనీల్లోకి వరదనీరు రాకుండా యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో డ్యాములు, రిజర్వాయర్ల వారీగా వరద పరిస్థితిని, సహాయక చర్యలను మంత్రికి వివరించిన కలెక్టర్ జి.వీరపాండియన్, ఎస్పీ డాక్టర్​ కె.ఫక్కీరప్ప మంత్రికి వివరించారు. జేసీ రవిపట్టన్ షెట్టి, కర్నూలు మున్సిపల్ కమిషనర్ డీకే బాలాజీ, ఇరిగేషన్ ఎస్ఈ శ్రీరామచంద్రమూర్తి, ఇతర ఇంజనీరింగ్​ అధికారులు పాల్గొన్నారు.