మలయాళ చిత్రం ‘ప్రేమమ్’ తో వెండితెరకు పరిచయమైంది సాయి పల్లవి. మొదటి సినిమాతోనే క్రేజ్ సంపాదించింది. టాలీవుడ్లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘ఫిదా’ సినిమాతో తెలుగు వాళ్లను ఫిదా చేసేసింది. సాయి పల్లవి అందం, అభినయంతో పాటు మంచి డ్యాన్సర్ కూడా. కమర్షియల్ చిత్రాల్లో ఆఫర్లు వస్తున్నా ప్రతీ ప్రాజెక్ట్‌పై సైన్ చేయకుండా ఆచితూచి సినిమాలను ఎంచుకోవడం ఆమె స్టైల్. అంతేకాదు ఒక ఫెయిర్‌నెస్ యాడ్ కోసం రూ.రెండుకోట్లు ఇస్తానన్నా.. అందులో నిజం లేదని, అలాంటి యాడ్స్ చేసి జనాన్ని మోసం చేయడం మంచిది కాదని, ఆ యాడ్ చేయనని డైరెక్ట్‌గా చెప్పేసి నిజాయితీ ఉన్న హీరోయిన్గా కూడా పేరు తెచ్చుకుంది సాయి పల్లవి.
అయితే ఇప్పుడు మరో న్యూస్ సాయి పల్లవి గురించి తెలిసింది. తను మంచి డ్యాన్సర్ కాబట్టి స్ఫెషల్ సాంగ్స్ చేయమని కొందరు డైరెక్టర్లు ఆమెను అప్రోచ్ అయ్యారట. పల్లవి చెయ్యబోనని నిర్మోహమాటంగా చెప్పేసిందట. ఒక్కపాట కోసం రూ.కోటిపైగానే రెమ్యునరేషన్ ఇస్తా అన్నా పల్లవి ఒప్పుకోలేదట. ఆ క్రమంలోనే మహేష్ బాబు సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో తమన్నా కంటే ముందే సాయి పల్లవిని సంప్రదించారట. పల్లవి నో చెప్పాకే ఆ సాంగ్‌కు తమన్నాను సెలక్ట్ చేశారట. దీంతో పల్లవి ప్రత్యేక గీతాలు చెయ్యడానికి ఇష్టం లేదని క్లారిటీ ఇచ్చినట్టే మరి.