సారథి న్యూస్, ఖమ్మం: క్రీడల్లో రాణించేలా ప్రతిరోజు సాధన చేయాలని ఖమ్మం పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ సూచించారు. హైదరాబాద్ సిటీ, నిజామాబాద్‌కు చెందిన 217 మంది సివిల్ పోలీస్ కానిస్టేబుళ్లు ఖమ్మం జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రంలో ఏడునెలలుగా ట్రైనింగ్ తీసుకుంటున్నారు. వారి మధ్య స్ఫూర్తిని పెంపొందించేలా రెండురోజుల పాటు ఖమ్మం సిటీపోలీస్ శిక్షణ కేంద్రంలో క్రీడాపోటీలు నిర్వహించారు. శనివారం నిర్వహించిన పోటీలకు ముఖ్యఅతిథిగా హాజరైన సీపీ తఫ్సీర్ ఇక్బాల్ విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కరోనా వంటి క్లిష్టమైన పరిస్థితుల్లో మానసికంగా ఉల్లాసం నింపేందుకు క్రీడలు దోహదపడుతాయని చెప్పారు. ఏఆర్ అడిషనల్ డీసీపీ మాధవరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ డీసీపీ మాధవరావు, సీటీసీ ఏసీపీ ప్రసాద్ రావు, ఏఆర్ ఏసీపీ విజయబాబు, సీఐ సాంబరాజు తదితరులు పాల్గొన్నారు.
- July 25, 2020
- Archive
- ఖమ్మం
- లోకల్ న్యూస్
- CP IQBAL
- KHAMMAM
- POLICE
- TRAINING
- క్రీడాపోటీలు
- ఖమ్మం
- పోలీసు శిక్షణ
- Comments Off on ఉల్లాసంగా.. ఉత్సాహంగా