Breaking News

ఉమ‌ర్ ఖాలీద్ అరెస్ట్​

ఉమ‌ర్ ఖాలీద్ అరెస్ట్​


న్యూఢిల్లీ : జేఎన్‌యూ మాజీ విద్యార్థి నాయ‌కుడు ఉమ‌ర్ ఖాలీద్‌ను ఆదివారం ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో దేశ‌రాజ‌ధానిలో చోటుచేసుకున్న ఢిల్లీ అల్ల‌ర్ల‌కు సంబంధించి.. పోలీసులు ఆయ‌న‌ను చ‌ట్ట వ్య‌తిరేక కార్య‌క‌లాపాల నిరోధ‌క చ‌ట్టం (ఉపా) కింద అదుపులోకి తీసుకున్నారు. ఇదే కేసులో జులైలో పోలీసులు ఆయ‌న‌ను విచారించిన విష‌యం తెలిసిందే. కాగా, శ‌నివారం ఖాలీద్‌కు స‌మ‌న్లు జారీ చేసిన పోలీసులు.. ఆదివారం మధ్యాహ్నం స‌మ‌యంలో ఆయ‌నను విచార‌ణ‌కు పిలిపించి అదుపులోకి తీసుకున్న‌ట్టు తెలుస్తున్న‌ది. త్వ‌ర‌లోనే ఖాలీద్‌పై చార్జిషీటు దాఖ‌లు చేయనున్నార‌ని స‌మాచారం. సోమ‌వారం ఆయ‌న‌ను కోర్టు ముందు హాజ‌రుప‌ర‌చ‌నున్నారు.