సారథి న్యూస్, పెద్దశంకరంపేట: మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలంలోని అన్ని గ్రామపంచాయతీల్లో ఈనెల 15వ తేదీ నుంచి ఉపాధి హామీ పనులను ప్రారంభించాలని ఎంపీడీవో రామ్నారాయణ సూచించారు. సోమవారం స్థానిక ఎంపీడీవో ఆఫీసులో పలు అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో నర్సరీలు, పల్లెప్రకృతి వనాల నిర్మాణాలను వేగవంతం చేయాలని ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వద్దని సూచించారు. సమావేశంలో ఈజీఎస్ ఏపీవో సుధాకర్, గ్రామ కార్యదర్శులు పాల్గొన్నారు.
- January 11, 2021
- Archive
- మెదక్
- లోకల్ న్యూస్
- EGS WORKS
- medak
- Upadihami
- ఉపాధి హామీ
- పెద్దశంకరంపేట
- మెదక్
- Comments Off on ‘ఉపాధి’ పనులు ప్రారంభించాలె