సారథి న్యూస్, రామాయంపేట: చిన్ననాటి స్నేహితులు తమ అనుబంధాన్ని చాటుకున్నారు. చనిపోయిన తమ స్నేహితుడి కుటుంబానికి అండగా నిలిచారు. కొంత ఆర్థిక సహాయం అందజేసి మేమున్నామని.. ధైర్యం చెప్పారు. మెదక్జిల్లా నిజాంపేట మండలంలోని చల్మేడ గ్రామానికి చెందిన కుమ్మరి బాలరాజు(36) మూడు రోజుల క్రితం చనిపోయాడు. ఈ ఘటనతో తమ చిన్ననాటి నుంచి కలిసి చదువుకున్న దోస్త్ ఫ్యామిలీకి ఆర్థిక సహాయం అందించాలని, అదే గ్రామానికి చెందిన మృతుడి ఫ్రెండ్స్ రూ.13,800 జమచేసి మృతుడి భార్యకు అందజేశారు. కార్యక్రమంలో రెడ్డి యాదగిరి, పౌడల రాజు, తుమ్మల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
- September 3, 2020
- Archive
- మెదక్
- లోకల్ న్యూస్
- FRIENDS
- medak
- NIZAMPETA
- RAMAYAMPETA
- నిజాంపేట
- ఫ్రెండ్స్
- మెదక్
- రామాయంపేట
- Comments Off on ఉదారత చాటిన స్నేహబంధం