న్యూఢిల్లీ: ప్రతినెలా చివరి ఆదివారం జరిగే మన్ కీ బాత్ కోసం కొందరి జీవితాలను ప్రభావితం చేసిన ఉత్తేజకరమైన కథలను షేర్ చేయాలని ప్రధాని నరేంద్రమోడీ పిలుపునిచ్చారు. ‘సామూహిక ప్రయత్నాలు, సానుకూల మార్పులను తీసుకొచ్చిన స్ఫూర్తి నింపే కథల గురించి కచ్చితంగా మీ అందరికీ తెలిసే ఉంటుంది. అనేక జీవితాలను మార్చిన కథల గురించి మన్ కీ బాత్ కోసం షేర్ చేయండి’ అని మోడీ ట్వీట్ చేశారు. నమో యాప్ ద్వారా లేదా మై జీవోవీ వెబ్‌సైట్ ద్వారా షేర్ చేయాలని కోరారు. ఈనెల 26న మన్‌కీ బాత్ జరగనుంది. గతనెల మన్ కీ బాత్‌లో మోడీ జవాన్ల గురించి మాట్లాడారు. వారి ధైర్య సాహసాలు అద్భుతమని ప్రధాని కొనియాడారు.
- July 11, 2020
- Archive
- Top News
- జాతీయం
- MANKIBATH
- MODI
- NAMO
- జవాన్
- నమోయాప్
- నరేంద్రమోడీ
- మన్‌కీబాత్
- Comments Off on ఉత్తేజిత కథలను షేర్ చేయండి