సారథి న్యూస్, కర్నూలు: నగరంలో ఇసుక బండ్ల కార్మికుల కడుపు కొట్టవద్దని రెండవ రోజు బుధవారం పాతబస్టాండ్ అంబేద్కర్ విగ్రహం ఎదుట సీఐటీయూ నాయకులు, కార్మికులు ఆందోళన చేపట్టారు. నగర ప్రధాన కార్యదర్శి ఎం.రామాంజనేయులు మాట్లాడుతూ తుంగభద్ర నది పరీవాహక ప్రాంతాలు జొహరాపురం, చిత్తారి వీధి, కొత్తపేట, రోజా వీధి ఏరియాల్లో 25 ఏళ్లుగా ఇసుక బండ్ల ద్వారా దళిత బడుగు బలహీనవర్గాలకు చెందిన కార్మికులు జీవనం సాగిస్తున్నారని అన్నారు.
వైఎస్సార్సీపీ ప్రభుత్వం పేదల ఉపాధికి గండి కొడుతూ 50 మంది కార్మికులు మరణానికి కారణమైందన్నారు. పెద్దపెద్ద ట్రక్కుల ద్వారా అక్రమంగా ఇసుకను తోడుకునే పెద్దలను వదిలేస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో సీఐటీయూ నగర నాయకులు అబ్దుల్ దేశాయ్, రవి, రంగస్వామి, షరీఫ్, ఇసుక బంధం నాయకులు వెంకటయ్య, సత్య రాజు, మధు, మాసూం, వలీ పాల్గొన్నారు.