సారథి న్యూస్, సిద్దిపేట: కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా కరోనా రాకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చని సిద్దిపేట పోలీసులు పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా పోలీసులు ఊరూరూ తిరిగి కరోనా రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రజాచైతన్య రథం ద్వారా ఎల్ఈడీ స్క్రీన్ ను చూపిస్తూ అవగాహన కల్పిస్తున్నారు. మంగళవారం దుబ్బాక పీఎస్ పరిధిలోని అప్పనపల్లి, పెద్దగుండవెల్లి గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించారు. కరోనాపై అవగాహన కల్పిస్తూ సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు మాట్లాడిన వీడియోలను ప్రదర్శించారు. ప్రతి ఒక్కరూ నాలుగు ఫీట్ల భౌతికదూరం పాటించాలని, నిత్యావసర సరుకులు కొనుగోలు చేసేవద్ద గుమి కూడవద్దని, 10 సంవత్సరాల లోపు పిల్లలను, 60 ఏండ్లు దాటిన వృద్ధులను ఇంట్లో నుంచి బయటకు వెల్లనివ్వవద్దని, ఎప్పటికక్పడు చేతులను సబ్బుతోగానీ, శానిటైజర్తోకానీ శుభ్రపరుచుకోవాలని పోలీస్‌సిబ్బంది ప్రజలకు సూచించారు.