సౌత్‌లో మంచి సినిమాలే చేసింది రకుల్ ప్రీత్ సింగ్. కొద్దికాలంగా తెలుగులో సినిమాలు చేయడం లేదు కానీ ఇప్పుడు వైష్ణవ్ తేజ్, నితిన్ తో రెండు సినిమాలకు కమిటైంది. అలాగే కోలీవుడ్ లో భారతీయుడు–2, అయాలన్ చిత్రాల్లో కూడా నటిస్తోంది. అయితే బాలీవుడ్ మరో ఆఫర్ రకుల్‌ను వరించింది. లాస్ట్ ఇయర్ అజయ్ దేవ్గన్చిత్రం ‘దేదే ప్యార్ దే’ లో నటించింది. అందులో రకుల్ గ్లామరస్ రోల్ అందరినీ మెప్పించింది. మోతాదుకు మించి గ్లామర్ ఒలకబోసింది. దీంతో అజయ్ మళ్లీ తాను నటిస్తూ నిర్మిస్తున్న ‘మే డే’ మూవీలో కూడా రకుల్‌ను ఎంపిక చేశాడట. అయితే ఇందులో బిగ్ బీ అమితాబచ్చన్ ఓ కీలకపాత్రలో నటిస్తున్నారు. బిగ్ బీతో కలిసి నటించాల్సి వస్తున్నందుకు ఆనందంతో తలమునకలవుతోంది రకుల్. ఇప్పటి వరకూ అమితాబ్ తో కలిసి పనిచేయలేదని.. ఇదే మొదటిసారి కనుక తనకెంతో సంతోషంగా ఉందంటూ సంబరపడుతోంది.
- November 19, 2020
- Archive
- Top News
- సినిమా
- AMITHABBACHAN
- BIGB
- BOLLYWOD
- MAY DAY
- RAKULPREESINGH
- అమితాబ్‌బచ్చన్
- కోలీవుడ్
- బాలీవుడ్
- బిగ్‌బీ
- భారతీయుడు 2
- రకుల్‌ప్రీత్‌సింగ్
- Comments Off on ఇదే మొదటిసారి..