లండన్: ఇండియా – చైనా మధ్య నెలకొన్న గొడవను సామరస్యంగా చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని యూకే ప్రధాని బొరిస్ జాన్సన్ అన్నారు. ‘ఒక దేశం కామన్ వెల్త్ మెంబర్, మరోవైపు ప్రపంచంలోనే అతిపెద్ద డెమోక్రసీ ఒకవైపు. ప్రజాస్వామ్యం అనే మన భావనను సవాలు చేసే రాష్ట్రం. రెండు దేశాల మధ్య జరుగుతున్న సంఘటనలను యూకే నిశితంగా పరిశీలిస్తోంది’ అని అన్నారు. ఈస్ట్రన్ లద్దాఖ్‌లో పరిస్థితి సీరియస్‌గా, ఆందోళనకరంగా ఉందన్నారు.
రెండు దేశాలు మాట్లాడుకుని సమస్యలు పరిష్కరించుకోవాలని సూచిస్తున్నామన్నారు. ఇండియా – చైనా బోర్డర్‌లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. కాగా, ఆ గొడవలు ఆపేందుకు రెండు దేశాలు చర్చలు జరుపుతున్నాయి.