Breaking News

ఇండియా–చైనాతో చర్చిస్తున్నాం..

వాషింగ్టన్‌: ఇండియా – చైనా మధ్య గొడవలు మరింత సంక్లిష్టంగా మారాయని, రెండు దేశాలతో చర్చలు జరుపుతున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు. ఇరు దేశాల మధ్య నెలకొన్న సమస్య చాలా పెద్దదే అని అన్నారు. అందుకే అమెరికా చర్చలు జరుపుతోందని, గొడవలు తీర్చేందుకు హెల్ప్‌ చేస్తామన్నారు. కరోనా వ్యాప్తి తర్వాత మొదటిసారి ఎలక్షన్‌ ప్రచారానికి బయలుదేరిన ట్రంప్‌ ఈ మేరకు మీడియాతో మాట్లాడారు. రెండు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం ఉందని, ఏం జరుగుతుందో చూడాలని చెప్పారు. ఇండియా – చైనా మధ్య నెలకొన్న పరిస్థితులను అమెరికా నిశితంగా పరిశీలిస్తోంది గతంలో కూడా ప్రకటించింది. ఈ మేరకు గొడవల్లో చనిపోయిన సైనికులకు అధికారి మైక్‌ పాంపియో నివాళులర్పించారు. చైనా కావాలనే దూకుడుగా వ్యవహరిస్తోందని ఆ దేశ విదేశాంగ అధికారి ఒకరు అన్నారు.