సారథి న్యూస్, కర్నూలు: ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో నగర శివారులోని వెంకాయపల్లె సమీపంలో తమకు పంపిణీ చేసిన ఇంటిస్థలాన్ని కొందరు కబ్జాచేశారని, మీరే తమకు న్యాయం చేయాలని బాధితులు స్థానిక ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్‌ఖాన్ ఎదుట మొరపెట్టుకున్నారు. శనివారం ఎమ్మెల్యేను ఆయన నివాసంలో కలిసి ఆవేదన వ్యక్తంచేశారు. పేదల ఇళ్లస్థలాలను కబ్జాచేసిన వారు ఎంతటివారైనా ఉపేక్షించేదిలేదని, న్యాయం జరిగేలా చూస్తానని బాధితుకు హామీ ఇచ్చారు.
గిడుగు రామ్మూర్తి ఆశయ సాధనకు కృషి
గిడుగు రామ్మూర్తి తెలుగు భాషా ఉన్నతికి ఎనలేని కృషిచేశారని ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్‌ఖాన్ కొనియాడారు. శనివారం తెలుగు భాషాదినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలోని కొండారెడ్డి బురుజు వద్ద ఉన్న తెలుగు తల్లి విగ్రహానికి ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ పూలమాల వేసి నివాళుర్పించారు. గిడుగు రామ్మూర్తి ఆశయ సాధనలో భాగంగా సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తెలుగు భాషా పరిరక్షణకు పెద్దపీట వేశారని, ప్రతి పాఠశాలలో ఆంగ్లంతో పాటు తెలుగు భాషను తప్పనిసరి చేస్తూ ఉత్తర్వు జారీ చేశారన్నారు. కార్యక్రమంలో రాయలసీమ విశ్వవిద్యాలయ అధ్యక్షుడు ప్రశాంత్ రెడ్డిపోగు, జిల్లా ప్రధాన కార్యదర్శి గౌతమ్ కటికె, రాష్ట్ర మహిళా కార్యదర్శి జమీలా సయ్యద్, జిల్లా సేవాదళ్ అధ్యక్షుడు మల్లికార్జున, యువజన నాయకుడు బత్తిని భగత్, రాజశేఖర్, హకీం పాల్గొన్నారు.