‘హ్యాపీ డేస్’తో మూవీ జర్నీ స్టార్ట్ చేసిన నిఖిల్ ట్రెండ్‌కు తగినట్టుగా తన కథలను ఎంచుకుంటూ కెరీర్లో ముందుకు దూసుకెళ్తున్నాడు. గతేడాది ‘అర్జున్ సురవరం’లో జర్నలిస్టుగా అలరించాడు. ఈ ఏడు నిఖిల్ ‘కార్తికేయ 2, 18 పేజెస్’ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. 18 పేజెస్ మూవీలో నిఖిల్ డిఫరెంట్ క్యారెక్టర్ తో అలరించనున్నాడట. గతంలో ‘సూర్య వర్సెస్ సూర్య’ సినిమాలో సూర్యుడంటే భయపడే పాత్రలో నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాలో మెమరీ లాస్ హీరోగా కనిపించనున్నాడు. అయితే ఈ క్యారెక్టర్ సినిమా సెకండాఫ్ లో రివీల్ అవుతుందని సమాచారం. ఆల్రెడీ తెలుగులో ఈ ఫార్ములాతో కొన్ని చిత్రాలు వచ్చాయి.
ఈ సినిమాలో దర్శకుడు సూర్య ప్రతాప్ మరింత కొత్తదనం ఉండేలా ప్లాన్ చేస్తున్నాడట. మెమరీలాస్ అనే ఇంట్రెస్టింగ్ పాయింట్ తో లవ్ స్టోరీనే ప్రధానాంశంగా ఉంటుందని తెలుస్తోంది. జ్ఞాపకశక్తి కోల్పోయి.. తనను ఇబ్బంది పెట్టే విలన్లను ఎలా జయించాడన్నదే ఆసక్తికర కథనం. ఈ సినిమాలో నిఖిల్ సరసన అను ఇమ్మాన్యుయేల్ ను హీరోయిన్ గా అనుకుంటున్నారట. గీతా ఆర్ట్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి.