ఆమె చేసేవన్నీ పెద్ద ప్రాజెక్టులే.. అందరూ పెద్ద హీరోలే. ఆమెకున్న పాపులారిటీ అలాంటింది. ఆమె ఎవరో కాదు దీపికా పదుకునే. బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకునే కి ఉండే క్రేజ్ ఎంతో అందరికీ తెలిసిందే. ఎందుకంటే హీరోయిన్గా నటించేందుకు బయటినుంచి వచ్చేవాళ్లు అక్కడ నిలదొక్కకోవడమంటే ఆషామాషీ కాదు. కరీనా కపూర్ వంటి సీనియర్ హీరోయిన్లతో సమానంగా నిలబడింది దీపికా పదుకొనే. అందుకే భారీ సినిమాల్లో హీరోయిన్ గా చెయ్యమంటూ ఆమెని వెదుక్కొంటూ వెళ్తున్నారు. ఆమె రెమ్యునరేషన్ ఎంతైనా వెనుకాడటం నిర్మాతలు వెనుకాడటం లేదంటే ఆమెకున్న పాపులారిటీ ఏమిటో అర్థమవుతోంది. ప్రస్తుతం దీపిక చేస్తున్నవన్నీ పెద్ద ప్రాజెక్ట్సే. కబీర్ ఖాన్ డైరెక్షన్లో తెరకెక్కిన ‘83’ చిత్రంలో రణ్ వీర్ సింగ్ సరసన లీడ్ రోల్ రోమీ పాత్ర చేసింది. షకున్ బాత్రా డైరెక్షన్లో ఓ చిత్రానికి కమిటయ్యింది.అలాగే హాలీవుడ్ రీమేక్ ‘ది ఇన్టర్న్’లో డెభ్బై యేళ్ల వయస్కురాలిగా అద్భుతమైన పాత్ర పోషించింది. ఈ చిత్రాలతో పాటు మధు మంతెనతో కలిసి ‘మహాభారత’ చిత్రాన్ని నిర్మిస్తోంది. అందులో ద్రౌపది పాత్రను తనే పోషించనుంది. ఇంకో పక్క త్రీడీ రామాయణంలో సీత పాత్రలో దీపిక పేరు వినిపిస్తోంది. అలాగే లేటెస్ట్గా ప్రభాస్‌కు జోడీగా ‘రాధే శ్యామ్’లో నటిస్తున్న దీపిక పదుకునే డేట్స్ ఇప్పుడప్పుడే నిర్మాతలకు చిక్కవు అనడంలో సదేహం లేదు.
- July 26, 2020
- Archive
- సినిమా
- BOLLYWOOD
- BUSY
- DIPIKA
- PROJECTS
- క్రేజ్
- దీపికా పదుకునే
- Comments Off on ఆ హీరోయిన్‌కు క్రేజ్ ఎక్కువ