సారథి న్యూస్, గంగాధర: ఇటీవల కరీంనగర్ జిల్లా, గంగాధర మండలం కోట్ల నర్సింహునిపల్లి గ్రామంలోని ఓ రైతు పొలంలో బయటపడ్డ విగ్రహాలు.. క్రీ.పూర్వం 8-9 వ శతాబ్ధం కాలం నాటి ఒకటో తీర్థంకరుడు పార్శనాథుడు , 24 వ తీర్థంకరుడు వర్ధమాన మహావీరుడివని పురావస్తుశాఖ అధికారులు గుర్తించారు. సోమవారం పురావస్తుశాఖ అధికారులు విగ్రహాలను పరిశీలించారు. ఈ ప్రాంతాన్ని రాష్ట్రకూటులు, వేములవాడ చాళక్యులు, కాకతీయులు పరిపాలించారని చెప్పారు. ఈ ప్రాంతంలో మరిన్ని పరిశోధనలు జరగవలిసి ఉన్నదని వారు అభిప్రాయపడ్డారు. కాగా ఈ ప్రాంతాన్ని పర్యాటకప్రాంతంగా గుర్తించాలని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పురావస్తుశాఖ అధికారులను కోరారు.
- June 15, 2020
- Archive
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- 8-9 వ శతాబ్ధం
- GANGADARA
- KARIMNAGAR
- MLA
- STATUES
- VARDHAMANA MAHAVEER
- పార్శనాథుడు
- Comments Off on ఆ విగ్రహాలు తీర్థంకరులవే