Breaking News

ఆషాఢం అదిరిపోయే ఆఫర్లు

ఆషాఢం అదిరిపోయే ఆఫర్లు

సారథి న్యూస్​, కర్నూలు: దేశంలోనే అతిపెద్ద ఆభరణాల వ్యాపార సంస్థల్లో ఒకటైన మబార్‌ గోల్డ్‌ అండ్‌ డైమండ్స్‌ ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని ‘ఆషాడం ప్రైస్‌ ప్రామిస్‌’ క్యాంపెయిన్​ను రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభించిందని కర్నూలు షోరూం హెడ్‌ అస్నఫ్‌, మార్కెటింగ్‌ మేనేజర్‌ నూర్‌ఉల్లా శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. క్యాంపెయిన్​లో భాగంగా బంగారు ఆభరణాల తరుగు చార్జీపై 20 శాతం నుంచి 50శాతం తగ్గింపు, వజ్రామివపై 25శాతం వరకు తగ్గింపు, 22 క్యారెట్ల పాత బంగారంపై 0 శాతం తగ్గింపు ఉంటుందని వారు వెల్లడించారు. ఆషాఢమాసంలో వినియోగదారులను ఆకర్షించేందుకు ఈ ఆఫర్లతోపాటు ఎక్కడైనా కొనుగోలుచేసిన పాతబంగారం ఆభరణాలను మలబార్‌ గోల్డ్‌ అండ్‌ డైమండ్స్‌ కొనుగోలు చేస్తుందని ఈ సందర్భంగా వారు చెప్పారు.

దేశంలోని అన్ని షోరూముల్లో ఈ అవకాశం ఉందని, కేవైసీ నిబంధనకు అనుగుణంగా చెక్కు ద్వారా లేదా ఆర్‌టీజీఎస్‌ ద్వారా నగదు చెల్లింపు జరుపుతామని చెప్పారు. వినియోగదారులు తమ పాత బంగారాన్ని మార్పిడి చేసుకోవడం ద్వారా సంపూర్ణ మివను పొందవచ్చన్నారు. మబార్‌ గోల్డ్‌ అండ్‌ డైమండ్స్‌ నుంచి కొనుగోలు చేసిన ప్రతి ఆభరణానికి కచ్చితమైన , పారదర్శకమైన బిల్లు ఇస్తామని అస్నఫ్‌, నూర్‌ ఉల్లా స్పష్టంచేశారు.