న్యూఢిల్లీ: ఆరునెలల సుదీర్ఘ విరామం తర్వాత తాజ్‌మహల్ మళ్లీ జనకళను సంతరించుకోనుంది. కరోనా కారణంగా ఈ ఏడాది మార్చి (17న)లో లాక్‌డౌన్ విధించడానికి కొద్దిరోజుల ముందే పర్యాటక ప్రదేశాల మూసివేతలో భాగంగా.. తాజ్‌మహల్‌కూ గేట్లు వేసిన విషయం తెలిసిందే. ఆరునెలల తర్వాత సోమవారం తాజ్‌మహల్‌లో పర్యాటకులను అనుమతించారు. అలాగే ఆగ్రా కోటనూ సందర్శించడానికి ప్రభుత్వం అనుమతిచ్చింది. అయితే తాజ్‌మహల్‌లో రోజుకు 5 వేల మందిని (మధ్యాహ్నం 2.30 వరకు 2,500.. తర్వాత మిగిలినవాళ్లు) ఆగ్రా కోటలో రోజుకు 2,500 మందిని అనుమతిస్తామని పురాతన, పర్యాటక శాఖ అధికారులు తెలిపారు. తాజ్ సందర్శనకు వచ్చేవాళ్లంతా తప్పకుండా కోవిడ్ నిబంధనలను విధిగా పాటించాలని సూచించారు. పర్యాటకులంతా మాస్కులు ధరించాలని, తరచూ చేతులను శానిటైజ్ చేసుకోవాలని, భౌతికదూరం పాటించాలని మార్గదర్శకాలు విడుదల చేశారు. ప్రపంచ పర్యాటక ప్రాంతాల్లో ఒకటిగా ఉన్న తాజ్‌ను ఏటా 70 లక్షల మంది సందర్శిస్తారని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. వీరిలో సగానికంటే ఎక్కువ మంది విదేశీయులే ఉన్నాయి.
- September 22, 2020
- Archive
- Top News
- జాతీయం
- AGRA
- LOCKDOWN
- TAJMAHAL
- TOURISM
- ఆగ్రా
- తాజ్‌మహల్
- పర్యాటకశాఖ
- లాక్‌డౌన్
- Comments Off on ఆర్నెళ్ల తర్వాత తాజ్‌మహల్ రీ ఓపెన్